ఫలించిన కార్మికుల పోరాటం.. దిగొచ్చిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

by srinivas |   ( Updated:2024-10-02 15:06:25.0  )
ఫలించిన కార్మికుల పోరాటం.. దిగొచ్చిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)లో కాంట్రాక్టు కార్మికుల(Contract Workers) పోరాటం ఫలించింది. నాలుగు రోజుల క్రితం దాదాపు 4 వేల 200 మంది కాంట్రాక్టు కార్మికులను ప్లాంట్ యాజమాన్యం తొలగించింది. దీంతో కార్మికులంతా ఒక్కటయ్యారు. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల ధర్నా(Dharna)కు పలు పార్టీలు, సంఘాల నేతలు మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి ప్లాంట్ ఆందోళనకు దిగాయి. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళనలను ఉధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాల నేతల సమక్షంలో ఒప్పుకుంది. ఈ మేరకు రీజనల్ లేబర్ కమిషనర్ నోటీస్ విడుదల చేశారు. దీంతో కాంట్రాక్టు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ప్లాంట్‌పై ఆధారపడి బతుకుతున్న తమను తీసివేయడంతో ఎంతో ఆందోళనకు గురయ్యామని చెప్పారు. దిక్కు తోచని పరిస్థితిల్లో తాము ఆందోళనకు దిగామని కార్మికులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed