Minister Anagani:‘వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. మంత్రి అనగాని స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-03 11:54:02.0  )
Minister Anagani:‘వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. మంత్రి అనగాని స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో రాష్ట్రం భారీగా నష్టపోయిందాని మంత్రి అనగాని సత్యప్రసాద్ (minister Satyaprasad) విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. భూదందాల పై ఉక్కుపాదం మోపుతామంటూ ప్రకటించారు. ఇప్పటికే భూదురాక్రమణ (నిరోధక) చట్టం 2024ను తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ఆరాచాకపాలనలో వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను లాక్కున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం వైఎస్ జగన్(YS Jagan) అరాచకానికి ఉదాహరణ అని మంత్రి ఆరోపించారు. భూదందాల పై కూటమి ప్రభుత్వానికి దాదాపు 10 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సులో వైసీపీ నేతల భూదందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చు అని సూచించారు. అయితే భూదందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు అని మంత్రి అనగాని స్పష్టం చేశారు.

Advertisement

Next Story