- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:‘మనకు ఆకాశమే హద్దు’..సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం మెగా డీఎస్సీ పై చేసిన సంగతి తెలిసిందే. అలాగే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచి ఇంటింటికి వచ్చి ఇస్తారు అనే హామీని కూడా పూర్తి చేసింది. దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజల కోసం సీఎం చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నాకంటూ ఓ స్థిరమైన సిద్ధాంతం ఉండదు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల మంచి కోసం ఎవరు ఏ నిర్ణయాలు చెప్పిన అది ప్రజలకు మేలు చేస్తుందంటే తప్పక అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. ‘మనకు ఆకాశమే హద్దు’ ఎవరు ఏ ఆలోచన ఇచ్చిన బాగుంటే అమలు చేస్తాం అన్నారు. నా లక్ష్యం ఒక్కటే నా ప్రతీ పనితో నా రాష్ట్ర ప్రజలకు లాభం జరగాలి..వారి జీవన ప్రమాణాలు పెరగాలి అని తెలిపారు. పేదవాడికి మనం అండగా ఉండాలి. వారి సంపద సృష్టించాలి అని పేర్కొన్నారు. అందుకే రాగద్వేషాలకు తావు లేకుండా కక్ష సాధింపులు లేకుండా అందరికీ పెన్షన్ ఇచ్చాం అని తెలిపారు. తాను ఏం చేసినా ప్రజాహితం కోసమే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.