- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: వైసీపీ ఆరో జాబితా కాసేపట్లో.. ఆయన మాత్రం పక్కా.. !
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఆరో జాబితా మరికాసేపట్లో విడుదల కానుంది. ఈ మేరకు వైసీపీ అధిష్టానం పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల, మంత్రి బొత్స, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఆరో జాబితాపై కసరత్తు పూర్తి చేశారు. ఈ క్రమంలో పలువురు పేర్లను పరిశీలించారు. బలా బలాలు, గెలుపోటములపై సర్వేలు చేశారు. ఈ మేరకు గెలిచే వారినే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని సన్నాహాలు చేశారు. దీంతో రెడీ చేసిన కొత్త ఇంచార్జుల జాబితాను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక మైలవరం నియోజవర్గంలో బీసీ నేతకు రంగంలోకి దింపుతున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మైలవరం జడ్పీటీసీగా ఉన్న తిరుపతిరావును అదే నియోజకవర్గానికి కొత్త ఇంచార్జిగా నియమించినట్లు సమాచారం. ఈ ఆరో జాబితాలో తిరుపతిరావు పక్కా ఉంటుందని మైలవర్గం వైసీపీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేయబోతున్న ఆరో జాబితాపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
కాగా వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తోంది. ఇప్పటికే కొత్త ఇంచార్జులను ఖరారు చేసి 5 జాబితాలు విడుదల చేసింది. మొత్తం 61 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాలకు ఇంచార్జులను ప్రకటించింది. అయితే ఈ నియోజకవర్గాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. వారిని కాదని కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా విడుదల చేయబోయే ఆరో జాబితాలోనూ కొత్త వారికి కల్పించారని తెలుస్తోంది. మరికాసేపట్లో వాళ్లు ఎవరనేది తేలనుంది.