- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వారెవ్వా.. ఇది పోలీస్ పవర్ అంటే..
దిశ డైనమిక్ బ్యూరో: ఆదివారాలు, పండగ సెలవలు, బందులు, పబ్లిక్ హాలిడేలు ఇవేమి లేకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేసే వాళ్ళే పోలీసులు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసులే. అయితే అనుక్షణం ప్రజల కోసం పనిచేసే పోలీసులను చూస్తేనే కొందరు ఆమడ దూరం పారిపోతారు. పోలీసులు అంటే రక్షకులు కాదు భక్షకులు అని మరికొందరి అభిప్రాయం.
అయితే పోలీసులందరూ ఒకే విధంగా ఉండరు. మంచి చెడు అనేది ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఉంటుంది. ఎవరో ఒక్కరు చేసిన తప్పుకి అందరిని నిందించకండి అని మాటలతో అడగలేదు. ప్రజల కొరకే పోలీసులు ఉన్నారని చేతల్లో చూపించారు. ప్రజలు పోగొట్టుకున్న కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఆ ప్రజలకు అందించారు.
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాలో నమోదైన మొబైల్ ఫోన్ మిస్సింగ్ కేసులపై పోలీస్ డిపార్ట్మెంట్ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళ పేరుతో ప్రాజెక్టును చేపట్టింది. పోలీసులు తలుచుకుంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరని నిరూపిస్తూ చోరీకి గురైన 650 మొబైల్ ఫోన్లను దొంగల నుండి కడప పోలీస్ డిపార్ట్మెంట్ రాబట్టింది.
కడప పోలీసులు రికవరీ చేసిన 650 మొబైల్ ఫోన్ల విలువ అక్షరాలా రూ/ 2 కోట్లు. కాగా ఈ రోజు కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు మొబైల ఫోన్లను కడప SP సిద్ధార్త్ కౌశల్ అందించారు. ఈ నేపథ్యంలో SP సిద్ధార్త్ కౌశల్ మాట్లాడుతూ.. స్పెషల్ మొబైల్ ఫోన్ రికవరీ మేళ సందర్భంగా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను దొంగల నుండి రాబట్టామని.. అనంతరం బాధితులను కడప జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించి వారికి ఫోన్లను అందించడం జరిగిందని తెలిపారు.