- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Atchannaidu:జగన్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: జగన్ తన ఐదేళ్ల అరాచక పాలనలో పంటల బీమాను అస్తవ్యస్తం చేశాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. రబీలో సాగు చేసిన రైతులను అసలు రైతులుగానే పరిగణించని నువ్వు బీమా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. ఐదేళ్ల పాటు రబీలో సాగు చేసిన ఒక్క రైతుకు బీమా అమలు చేయని నీ అసమర్థ ప్రభుత్వంలో రైతులు ఎంతో తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
ఐదేళ్ల పాటు రబీ సీజన్లో బీమా పథకాన్ని అమలు చేయక పోగా రైతులు సొంతంగా బీమా చెల్లించే సౌలభ్యం కూడా లేకుండా చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో రైతులకు ఉద్యాన రాయితీలు లేవు. సూక్ష్మ సేద్యం లేదు, సకాలంలో ఎరువులు అందలేదు.. అని వివరించారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్ డి ఏ ప్రభుత్వంలో తిరిగి రైతులకు అన్ని రాయితీలు అందుతున్నాయి అని తెలిపారు. రైతుల పై బీమా ప్రీమియం భారమా..? అంటూ సోషల్ మీడియాలో జగన్ వేసిన ప్రశ్నలకు మంత్రి ట్విట్టర్లో సమాధానం ఇచ్చారు.