- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ జిల్లాను రద్దు చేసే ప్రసక్తే లేదు’.. స్పష్టం చేసిన మంత్రి
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఆ జిల్లా పేరు మారుతుందనే వార్తల పై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో రాష్ట్రం నష్టపోయిందని విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవల బాపట్ల జిల్లాను రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లాను రద్దు చేసే ప్రసక్తే లేదని మంత్రి అనగాని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఈ క్రమంలో పుకార్లను నమ్మొద్దు అని ప్రజలను కోరారు. బాపట్ల జిల్లా అదే విధంగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో కొత్తగా మార్కాపురం జిల్లా, హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని మంత్రి అనగాని గుర్తు చేశారు.