- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారంటీర్లను తొలగిస్తారని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారని వస్తోన్న ప్రచారంపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్లను వైసీపీ రాజకీయంగా వాడుకుందని, వారి భవిష్యత్తును దెబ్బకొట్టేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు తమ భవిష్యత్ పట్ల ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని తెలిపారు.
భయాందోళనలకు గురిచేసే ఎలాంటి తప్పుడు కథనాలనూ నమ్మొద్దన్నారు. కుట్రపూరిత కథనాలతో ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు జేసే దుష్ట చర్యలను తాము ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యువల్ చేయకుండా దగా చేసిన గత పాలకులు.. ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్‌నూ దెబ్బకొట్టేందుకు నిరాధార, కుట్రపూరిత కథనాలను ప్రచారంలోకి తేవడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. కాగా, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.