- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. సోషల్ మీడియాలో లిస్ట్ వైరల్..?
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హాడావుడి మొదలైంది. టీడీపీ-జనసేన- బీజేపీల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారు కావడంతో ఏపీ ఎన్నికల సినారియోపై ఒక క్లారిటీ వచ్చేసింది. టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ కూటమి మధ్య ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది. ఇక, పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది. ఇందులో జనసేన 24 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగనుండగా.. కేంద్రంలో హ్యాట్రికే విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ ఏపీలో 6 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.
మూడు పార్టీలకు సీట్ల సర్ధుబాటుపై క్లారిటీ వచ్చినప్పటికీ.. ఏయే స్థానాల్లో ఎవరూ పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మూడు పార్టీల నేతల మరోసారి భేటీ అయ్యి పోటీ చేయబోయే స్థానాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన ఆరు స్థానాలతో పాటు అక్కడ పోటీ చేయబోయే ఆరుగురు అభ్యర్థులు పేర్లు ఖరారు అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయిన తర్వాత వీరి పేర్లను లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న లిస్ట్ ఇదే:
1) అరకు- కొత్తపల్లి గీత
2) అనకాపల్లి- సీఎం రమేష్
3) రాజమండ్రి- పురందేశ్వరి
4) రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్
5) హిందూపూర్- సత్య కుమార్ లేదా పరిపూర్ణనంద స్వామీ
6) ఏలూరు - సుజనా చౌదరి లేదా తపనా చౌదరి