JubileeHills: తారకరత్నకు అన్నీ తానైన బాలకృష్ణ

by srinivas |   ( Updated:2023-02-20 11:08:24.0  )
JubileeHills: తారకరత్నకు అన్నీ తానైన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారకరత్న అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. అయితే తారకరత్నకు అన్నీతానై బాలకృష్ణ వ్యహరించారు. తారకరత్న అంత్యక్రియలను కూడా దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న పార్ధివదేహం పాడెను మోశారు. అటు తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆయన వెంటే ఉన్నారు. ప్రథమ చికిత్స మొదలు మెరుగైన వైద్యం వరకూ బాలకృష్ణ దగ్గర ఉండి మరీ చేయించారు. తారకరత్నకు చికిత్స జరిగిన 23 రోజులు కూడా బాలకృష్ణ బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్దే ఉన్నారు. ఆస్పత్రిలో తారకరత్న కుటుంబానికి ఏ అవసరమొచ్చినా స్వయంగా బాలకృష్ణే సమకూర్చారు. అలాగే తారకరత్న చికిత్స ఖర్చులు కూడా బాలకృష్ణనే కట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story