- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనసేనకు మరో బిగ్ షాక్.. గాజు గ్లాసు గుర్తు కోసం RPC పార్టీ పిటిషన్
దిశ, వెబ్ డెస్క్: గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
కాగా గాజు గ్లాసు గుర్తు కావాలని అటు జనసేన పార్టీ సైతం ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అదే గుర్తుపై ఆ పార్టీ పోటీ చేసింది. దీంతో ఈ సింబలే తమకు కావాలని జనసేన పార్టీ కోరుతోంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం.. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తును విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇదే తరహా సింబల్స్‌ను విడుదలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ లిస్టులోనే విడుదల చేసింది. దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సైతం కోరుతోంది. అంతేకాదు కోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. గురువారం కోర్టులో ఎలాంటి ఆదేశాలు వస్తాయో చూడాలి.
అయితే ఏపీలో టీడీపీ, వైసీపీలను మాత్రమే ఎన్నికల సంఘం ప్రాంతీయ పార్టీలుగా గుర్తించింది. టీడీపీకి సైకిల్, వైసీపీకి ఫ్యాన్ గుర్తులు కేటాయించింది. జనసేనను మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వలేదు. జనసేనను రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణిస్తోంది. దీంతో ఆ పార్టీకి ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు గుర్తును కేటాయిసూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
Read More..
రాష్ట్రంలో వైసీపీ మెలో డ్రామాలు, బ్లేమ్ గేమ్స్.. పవన్ కల్యాణ్ ఫైర్