విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

by Anjali |
విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు బయటికెళ్దామంటే జంకుతున్నారు. మే నెల రాకముందే ఈ రీతిలో ఎండలు దంచికొట్టడంతో జనాలు పలు జాగ్రత్తలు వహిస్తూ బయటికి వస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల(ఏప్రిల్) 23 వరకు సాగే పాఠశాలల్లో క్రమం తప్పకుండా వాటర్ బెల్ కొనసాగించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో డిహైడ్రేషన్ నివారణకు రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని తెలిపింది. అలాగే ఏప్రిల్ 23 వరకు ప్రతి రోజూ డీఈఓ లు దీన్ని పర్యవేక్షించాలని వెల్లడించారు. మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు గుర్తించేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని, ఉదయం 9. 45- 10. 05- 11. 50 గంటలకు తప్పకుండా వాటర్ బెల్ మెగించాలని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed