మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-10-22 08:13:09.0  )
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నూతన మద్యం(New liquor) షాపులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఏపీలో నూతన లిక్కర్ పాలసీ(New Liquor Policy)ని చంద్రబాబు సర్కార్(AP Government) అమలు చేస్తోంది. అయితే కొత్త మద్యం అమలులోకి రావడం, వాటి ధరలు తగ్గించడం తో మందుబాబులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం నూతన షాపుల్లో డిజిటల్ చెల్లింపుల(digital payments) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ(Excise Department) మరో శుభవార్త చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యాని(quarter liquor)కి సంబంధించిన ఉత్పత్తిని పెంచినట్లు తెలిపింది. ఈ నెల (అక్టోబర్) చివరి నాటికి 2.4 లక్షల మద్యం కేసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పలుచోట్ల రూ.99 మద్యం లభించక మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 4 కంపెనీలు తమ 7 రకాల బ్రాండ్లను రూ.99 MRP పై అమ్మేందుకు అనుమతి పొందాయి.

Advertisement

Next Story