ప్రకాశం బ్యారేజీని ముంచెత్తిన వరద.. చరిత్రలో ఎన్నడు లేనంత ఇన్‌ఫ్లో

by Mahesh |
ప్రకాశం బ్యారేజీని ముంచెత్తిన వరద.. చరిత్రలో ఎన్నడు లేనంత ఇన్‌ఫ్లో
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది పొంగి పొర్లుతుంది. ఈ నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, కృష్ణ బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిన్న చితక వాగులు కూడా పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో దిగువన ఉన్న కృష్ణ బ్యారేజీకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం భారీ మొత్తంలో వర్షం కురుస్తుండగా ఈ వరద మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. కాగా ప్రస్తుతం విజయవాడ జలదిగ్బంధంలోనే ఉండగా.. ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

Advertisement

Next Story

Most Viewed