- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: ఆరుగురు వలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ వేటు.. కారణం ఇదే!?
దిశ, ప్రతినిధి: ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడిన వారి పై ఎన్నికల సంఘం ఉక్కు పాదం మోపుతున్నా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతూనే ఉంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికార పార్టీనే బాధ్యతారాహిత్యంగా ఎన్నికల కోడ్ నిబంధలను తుంగలో తొక్కడం బాధకారమంటున్నారు విశ్లేషకులు. నిన్న ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ ప్రచారంలో పాల్గొన్న పదహారు మంది వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు.
ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో 6 మంది వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణ జిల్లా, బందరు మండలంలోని చిన్నాపురం గ్రామంలో వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాగా ఎన్నికల కోడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆరుగురు వలంటీర్లు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. దీనితో ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ ఎంపీడీఓ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఓ వైపు అధికారులు ఎన్నికల కోడ్ నిబంధలను ఉల్లంఘించిన వలంటీర్లపై చర్యలు తీసుకుంటున్నా కొంత మంది వలంటీర్లు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. నిన్న (బుధవారం) గిలకలదిండిలో ఎమ్మెల్యే పేర్ని నాని నిర్వహించిన ప్రచారంలో లంకే ఏడుకొండలు అనే వలంటీర్ పాల్గొనడం కొందరు వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పలాడుతున్నారు అనే దానికి అద్దం పడుతోంది.
Read More..
ఆంధ్రాలో ఆగని ఎన్నికల కోడ్ ఉల్లంఘన..అధికార పార్టీ ప్రచారాల్లో వాలంటీర్లు