Breaking: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం

by srinivas |   ( Updated:2024-04-04 13:22:42.0  )
Breaking: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వారిని బదిలీ చేసింది. అయితే వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డీకే బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వి. వినోద్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చెందోలు, అనంతపురం ఎస్సీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌, గుంటూరు రేంజ్ ఐజీగా సర్వ శ్రేష్ట త్రిపాఠి, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్‌ను ఎన్నికల సంఘం నియమించింది. అంతేకాదు వారంతా గురువారం రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

కాగా రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో నగదు, మద్యం, గంజాయి సరఫరా, ఎన్నికల ప్రచార సామాగ్రి తరలింపుపై నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహించి సీజ్ చేస్తున్నారు. అటు శాంతి భద్రత విషయంలోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా సరే పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురు పత్రిపక్ష నాయకులకు గాయాలయ్యాయి. అయితే పోలీసు అధికారులు అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పలు అధారాలను సమర్పించారు. ఈ మేరకు క్షుణ్ణంగా విచారించిన ఎన్నికల సంఘం.. పలువురు కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసింది.

Read More..

Ap Politics:చెవిరెడ్డి అరాచక, కుటుంబ పాలన అంతమే లక్ష్యం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

Advertisement

Next Story

Most Viewed