- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ నేతల్ని ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు దగ్గర్లోనే ఉంది: ధూళిపాళ్ల నరేంద్ర
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు బోగస్ కేసు అని తేలిపోయింది అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ అన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో పనిచేసిన సీఐడీ చివరకు ఒక గాసిప్ ఏజెన్సీగా నిలిచింది అని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 48 రోజులైనా సీఐడీ రూపాయి అవినీతిసొమ్ము ఆయనకు, ఆయన కుటుంబానికి అందినట్టు నిరూపించలేకపోయింది అని అన్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో టీడీపీ సభ్యత్వం పొందడానికి కార్యకర్తలు చెల్లించే సొమ్ముని అవినీతిసొమ్ముగా చూపడానికి కిందామీదా పడుతోంది అని ధ్వజమెత్తారు. కార్యకర్తలు పార్టీకి అందించే సభ్యత్వ రుసుము... కార్యకర్తలు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి పార్టీ అందించే ప్రతిరూపాయి పారదర్శకమే. కార్యకర్తలు.. పార్టీ మధ్య జరిగే చెల్లింపుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ కంటాక్స్ విభాగానికి తెలియచేస్తూనే ఉంటుంది. నిన్నటివరకు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలే లేవన్న మంత్రులు..సదరు కార్పొరేషన్ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, నేడు శిక్షణా కేంద్రాలకు మంచి పరికరాలు.. సాఫ్ట్ వేర్ అందించలేదనడం వారి రెండునాల్కల ధోరణికి నిదర్శనం అని అన్నారు. అధికారముందన్న అహంకారంతో నోరుపారేసుకుంటున్న మంత్రులు.. వైసీపీ నేతల్ని ప్రజలు బట్టలు విప్పి పరుగులు పెట్టించే రోజు దగ్గర్లోనే ఉంది అని ధూళిపాళ్ల నరేంద్రకుమార్ హెచ్చరించారు.