- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొందూ దొందే.. కరోనా ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లు ఏమయ్యాయి?
అప్పులు చేయడంలో ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువేం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందే అన్నట్లున్నాయి. ఎఫ్ఆర్బీఎమ్ ను దాటేసి అప్పులు చేయడంలో రెండు ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పును రూ.3.98 లక్షల కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. మరి కార్పొరేషన్ల ద్వారా సేకరించిన రుణాలు, ప్రభుత్వ గ్యారెంటీ లేని అప్పులు, చెల్లించాల్సిన బకాయిల సంగతేంటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారీతిన అప్పులు చేస్తూ ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన లెక్కల ప్రకారం అప్పులు 3.98 లక్షల కోట్లు మాత్రమే. వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరించింది సుమారు రూ.1.71 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా తెచ్చింది మరో రూ.87 వేల కోట్లు ఉండవచ్చంటున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి నేటి దాకా వివిధ పనుల కింద చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇలా మొత్తం లెక్కిస్తే అప్పులు సుమారు రూ.8.71 లక్షల కోట్లు ఉండొచ్చు.
రాష్ట్ర విభజన నాటికి ఇదీ పరిస్థితి
రాష్ట్ర విభజన నాటికి రూ. 97 వేల కోట్లు అప్పు ఉంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1.62 లక్షల కోట్లు అప్పు చేసింది. దీనిపై నాడు పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వైసీపీ అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర అప్పు రూ.2.59 లక్షల కోట్లకు చేరింది. 2022 మార్చి నాటికి 3.98 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడించింది. మూడేళ్లలో రూ. 1.39 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున రూ.32 వేల కోట్లు అప్పు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం రూ.46 వేల కోట్లు అప్పు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కేంద్రం ఇస్తున్న లెక్కలకు వాస్తవాలకు ఎక్కడ పొంతన లేదని ఆర్థికవేత్తలు తప్పుబడుతున్నారు.
8 ఏళ్లలో రూ.80 లక్షల కోట్లు
ఇక కేంద్రంలో ఎన్డీఏ సర్కారు 2014లో అధికారానికి వచ్చే నాటికి మొత్తం 67 ఏళ్లలో రూ.55 లక్షల కోట్ల అప్పులున్నాయి. గడచిన ఎనిమిదేళ్లలో కేంద్రం చేసిన అప్పు సుమారు రూ.80 లక్షల కోట్లుంది. ఇదిగాక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేస్తోంది. కరోనా రెండేళ్ల సమయంలో పెట్రో ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఎక్సైజ్సుంకాన్ని విధించింది. సుమారు రూ.26 లక్షల కోట్లను జనం జేబుల నుంచి కొట్టేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక పీఎం కేర్, సీఎం కేర్ కు జమైన ఫండ్స్ గురించి లెక్కలే లేవు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా సమాధానం చెప్పే నాథుడు లేడు.
ఆ నిధులు ఎవరికి ఇచ్చారు?
కరోనా రిలీఫ్ కింద కేంద్రం నాడు రూ. 20 లక్షల కోట్లు కేటాయించింది. అవి ఎవరికిచ్చారు.. ఏ రంగాన్ని నిలబెట్టేందుకు విడుదల చేశారనేది చిదంబర రహస్యం గానే మిగిలిపోయింది. ఎం ఎస్ఎమ్ఈ పరిశ్రమలకు ఈ నిధులు కేటాయిస్తామన్నారు. సదరు పరిశ్రమలకు ఇచ్చి ఉంటే ఉత్పత్తి పెరగాలి. దీంతో పాటు ఉపాధి అవకాశలు పుంజుకోవాలి. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. అవి ఇప్పటికీ కోలుకోలేదు. మరి రిలీఫ్ నిధులు ఏమయ్యాయనేది చెప్పే వాళ్లు లేరు. పీఎం నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎవరూ నోరు మెదపడం లేదు. కనీసం పార్లమెంటు ఉభయ సభల్లో వీటిపై చర్చకు పెట్టిన దాఖలాల్లేవు.
చట్ట సభల్లో చర్చ జరగాలి..
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడూ ఒక్క ప్రెస్‌మీట్ పెట్టినట్టు లేదు. అప్పుడప్పుడు మన్‌కీ బాత్ పేరుతో ప్రధాని సాధరన విషయాలు మాత్రమే వినిపిస్తున్నారు. దిగజారుతున్న దేశ ఆర్థిక స్థితిగతులపై ఏనాడూ మీడియాతో మాట్లాడలేదు. పెట్రోల్ రూ.40, డాలర్‌ను రూ.40 కు తెస్తామన్న బీజేపీ హామీని ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతను విస్మరించింది.
అధిక ధరల వల్ల టీడీపీ హయాంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించాల్సి వచ్చిందని నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అంతకన్నా దారుణంగా ధరలు పెంచేశారు. పైగా కేంద్ర, రాష్ట్ర పాలక ప్రభుత్వాలు ప్రతిపక్షాలను నిందించడం విడ్డూరంగా ఉంది. ఈ అంశాల అన్నింటిపై చట్ట సభల్లో చర్చ జరగాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ప్రజలకు తెలియజేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని రాజకీయ మేథావులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
Also Read....
రైతులకు PM న్యూఇయర్ గిఫ్ట్.. అకౌంట్లో డబ్బులు పడేది అప్పుడే?