ఏపీలో ఎన్నికలు.. వేగం పెంచిన సీఈసీ అధికారులు

by srinivas |   ( Updated:2024-02-21 13:32:54.0  )
ఏపీలో ఎన్నికలు.. వేగం పెంచిన సీఈసీ అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ విన్ అయింది. దీంతో సీఎం జగన్ అధికారం చేపట్టారు. మరో రెండు నెల్లలో ఐదేళ్ల అధికార సమయం ముగియనుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సీఈసీ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, సమస్యత్మాక ప్రాంతాలు, భద్రత వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షి నిర్వహించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలని సూచించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులకు మరోసారి అవకాశం కల్పించాలని అధికారులకు సీఈసీ అధికారులు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed