- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
YS Sharmila:‘ఈ శతాబ్దపు పెద్ద జోక్ అది’.. మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైఎస్ జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిన్న వైఎస్ జగన్, షర్మిల వివాదం పై తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma) స్పందిస్తూ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ విజయమ్మ రాసిన లేఖకు నేడు(బుధవారం) వైసీపీ ట్విట్టర్(YCP Twitter) వేదికగా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘దివంగత మహానేత వైయస్సార్‌గారి భార్యగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డిగారి తల్లిగా శ్రీమతి విజయమ్మగారిని అమితంగా గౌరవిస్తాం. YSRగారి కుటుంబ వ్యవహారంపై విజయమ్మగారు బహిరంగ లేఖ విడుదలచేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు, ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం’’ అని వైసీపీ ట్వీట్‌లో రాసుకొచ్చారు.
ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌తో వివాదం నేపథ్యంలో వైసీపీ ఆరోపణలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ సెటైర్లు వేశారు. ‘ఈడీ అటాచ్(Attached ED) చేసింది రూ.32 కోట్ల విలువైన కంపెనీ ఆస్తిని. షేర్ల బదిలీపై ఆంక్షలు లేవు. గతంలో ఈడీ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటికి స్టాక్ మార్కెట్(stock market)లో ట్రేడింగ్(Trading), బదిలీలు మాత్రం ఆపలేదు. ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదం. నాకు విజయమ్మకు రూ.42 కోట్లు షేర్లు ఎలా అమ్మారు? నాకు 100 శాతం వాటాలు ఇస్తామని MOUపై జగన్ సంతకం చేశారు. బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?’ అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.