- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి మంచి జరిగే అవకాశం ఉంది.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ విభజన చట్టం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. విభజన చట్టం కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. ఢిల్లీలో మంగళవారం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ అఫిడవిట్ వల్ల రాష్ట్రానికి మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదాతోపాటు విభజన చట్టంలోని హామీలు అమలులో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు సైతం విడుదలకు కేంద్రం మార్గదర్శకం చేసే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు.
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నాటి సీఎం చంద్రబాబును తాను కోరానని అయితే ఫైల్ చేస్తానని చెప్పి చేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అయినా అఫిడవిట్ దాఖలు చేయడంతో రాష్ట్రానికి మంచి జరుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో సహా పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నియమ నిబంధనలు అవసరమని ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే గతంలో విచారణ జరగాల్సి ఉండగా... బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై, తుది విచారణలో ఉన్న పిటిషన్లపై మాత్రమే వాదనలకు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ప్రత్యేక నిబంధన తీసుకువచ్చింది. దీంతో విచారణను ఏప్రిల్ 11కు త్రిసభ్య ధర్మాసనం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.