- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జైలు నుంచి బయటకొచ్చాక చంద్రబాబు చేసే తొలి పని ఇదే.. ఏర్పాట్లు కూడా రెడీ
దిశ, వెబ్‌డెస్క్: సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కానుండగా.. అనంతరం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ వరకు భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. ఈ ర్యాలీకి టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తోన్నారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా విజయవాడలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం విజయవాడ నుంచి విమానంలో తిరుపతి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం హైదరాబాద్ చేరుకోనున్న చంద్రబాబు.. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి చికిత్స పొందనున్నారు.
సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. 52 రోజులుగా జైల్లోనే ఆయన ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు అనంతరం ఇవాళ హైకోర్టు కొన్ని షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Read More: యుద్ధం ఇప్పుడే ప్రారంభం అయ్యింది: చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై నారా లోకేశ్