AP Politics:ఏపీకి నష్టం కలిగించిన చంద్రబాబు,జగన్‌కు బుద్ధి చెప్పండి: షర్మిలా రెడ్డి

by Jakkula Mamatha |
AP Politics:ఏపీకి నష్టం కలిగించిన చంద్రబాబు,జగన్‌కు బుద్ధి చెప్పండి: షర్మిలా రెడ్డి
X

దిశ,మడకశిర: రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి గత పది సంవత్సరాలుగా తీరని నష్టం కలిగిందని ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే కేంద్రంలో ఇండియా కూటమితో ప్రభుత్వం ఏర్పడవలసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. గురువారం మడకశిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సేవ యాత్ర కార్యక్రమం అమరాపురం బస్టాండ్ లోని వైఎస్ఆర్ సర్కిల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజలను ఉద్దేశించి షర్మిలారెడ్డి మాట్లాడారు.

గత ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలలో తిరగకుండా ప్రజా సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం చేయకుండా కేవలం అమరావతికే పరిమితమై ఉన్నాడని అయితే ఇప్పుడు ఎన్నికలు రావడంతో సిద్ధం సభ అంటూ ప్రజల వద్దకు వస్తూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ మరోసారి అధికారం కోసం ఓటర్లకు డబ్బులు వెదజల్లి అధికారం దక్కించుకోవడం కోసం, వైసీపీ,టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారి నుంచి ఓటర్లు డబ్బులు తీసుకుని మనకు అందుబాటులో ఉండే ప్రజా సమస్యలపై పోరాడే వారికి ఓట్లు వేయాలని తప్పుడు మాటలు చెప్పే వారికి ఓట్లు వేయరాదని మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తు మీ నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కావున ఓటరు ఆలోచించి ఓటు వేయాలని ఆమె తెలియజేశారు.

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరు ఎన్నికల్లో గెలవరని ఆమె పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి లు ప్రధాని నరేంద్ర మోడీకి తొత్తులుగా వ్యవహరించడంతో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన దానిని కూడా తీసుకొని రావడంలో వారు విఫలం చెందారని బీజేపీ ప్రభుత్వానికి వారిద్దరూ గులాములుగా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు రాజధాని లేకుండా చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కంటే అధికంగా నష్టం చేశాడని ఆమె విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా కాలువ పనులు 90% పూర్తిచేసే పది శాతం పనులు కూడా టీడీపీ,వైసీపీ నేతలు పూర్తి చేయకుండా రైతులకు సాగునీరు అందకుండా చేశారని ఆమె విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed