TS High Court: అవినాశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2023-04-17 11:13:53.0  )
TS High Court: అవినాశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అవినాశ్ రెడ్డి లాయర్, సీబీఐ తరపున వాడివేడిగా వాదనలు జరిగాయి. చివరకు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు పిలవాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది.

ఇరువర్గాల మధ్య వాదనలు ఇలా జరిగాయి...

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. విచారణకు వస్తే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని సీబీఐను హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఇందుకు సీబీఐ అవసరమైతే అరెస్ట్ చేస్తామని తెలిపింది. భాస్కర్ రెడ్డి పిటిషన్ హైకోర్టు విచారణలో ఉండగానే ఆయన్ను అరెస్ట్ ‌చేశారని అవినాశ్‌రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై ఎలాటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. దస్తగిరిని సీబీఐ బెదిరించి చిత్ర హింసలకు గురి చేసిందని తెలిపారు. సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా దస్తగిరి సాక్ష్యం ఇచ్చాడని లాయర్ పేర్కొన్నారు.

ఈ విషయం విచారణలో ఎర్ర గంగిరెడ్డి చెప్పారని అవినాశ్ రెడ్డి లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాశ్ రెడ్డి సహ నిందితుడని ప్రచారం జరుగుతోందని లాయర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి అసలు హంతకులు ఎవరో తేల్చడం లేదని అవినాశ్ రెడ్డి తరపు లాయర్ చెప్పారు. రాజకీయ కోణంలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని కోర్టుకు లాయర్ తెలిపారు.

Advertisement

Next Story