- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pattabhi: నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేయడమే కాకుండా తనను అక్రమంగా అరెస్టు చేసి తీవ్ర మానసిక, భౌతికక్షోభకు గురిచేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కుటుంబంతో కలిసి మానవ హక్కుల కమిషన్ సభ్యుడు రాజీవ్ జైన్‌కు పట్టాభి ఫిర్యాదు చేశారు.
ఎస్పీ జాషువా ఆదేశాలతో అక్రమ అరెస్ట్
కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో తనను అక్రమంగా అరెస్టు చేసి సెల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. గంటల తరబడి పోలీస్ వాహనంలో తిప్పుతూ నిర్మానుష్య ప్రదేశాల్లో ఆపుతూ భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. చివరగా ఎస్సీ ఆదేశాలతో తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విద్యుత్ సరఫరా తొలగించి.. సిబ్బందిని బయటకు పంపి.. ముగ్గురు మాస్క్ ధరించిన వ్యక్తులతో దాదాపు 40 నిమిషాల పాటు భౌతికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 20న అరెస్టు చేసి 21వ సాయంత్రం వరకు అరెస్టు విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పలేదన్నారు. వైద్యపరీక్షల్లో ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని అభ్యర్ధించినా అనుమతించలేదని వాపోయారు.
నాలుగు సార్లు ఇంటిపై దాడి
మరోవైపు తన సతీమణిని కూడా గృహనిర్భంధం చేశారని...ఇప్పటికి నాలుగు సార్లు తనపై, తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను కూడా భయాందోళనలకు గురిచేశారని రాజీవ్ జైన్‌కి పట్టాభి వివరించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతిపక్షపార్టీ నాయకులపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టుల ఉదంతాలను రాజీవ్ జైన్‌కి తెలియజేశారు. మానవ హక్కులను ఉల్లంఘించి, తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర విషాదంలోకి నెట్టి చిత్రహింసలకు గురి చేసిన పోలీసు అధికారులపై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను పట్టాభిరామ్ కోరారు.