Ap: సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ ఆగ్రహం.. అమిత్ షాకు ఫిర్యాదు

by srinivas |   ( Updated:2023-09-28 12:45:29.0  )
Ap: సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ ఆగ్రహం.. అమిత్ షాకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌ సర్వీస్ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ కేసుల విషయంలో విచారణ జరపకుండానే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను బయటకు చెబుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీకి అనుకూలంగా సంజయ్ వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఆల్ ఇండియన్ సర్వీస్ రూల్స్ మేరకు పని చేయాల్సిన సంజయ్ రాజకీయ పక్షపాతాలకు పోతున్నారని వినతి పత్రం అందజేశారు. ఏపీ సీఐడీ చీఫ్ సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ వైసీపీ కార్యకర్తలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ కోసం ప్రతిపక్ష పార్టీలపై బురద చల్లుతున్నారని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story