బ్రేకింగ్: టీడీపీలో మరో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి

by Satheesh |   ( Updated:2023-03-02 13:24:58.0  )
బ్రేకింగ్: టీడీపీలో మరో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గతకొన్ని రోజుల క్రితం హార్ట్ అటాక్‌కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఇకపోతే కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు గతంలో మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా పని చేశారు.

2014లో ఆయ‌న‌ కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అనంతరం గన్నవరం ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. 2024ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలని భావించారు. అయితే అనారోగ్యం బారినపడటంతో ఆయనను తప్పించి కొనకళ్ల నారాయణను ఇన్‌చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అర్జునుడు మరణంతో టీడీపీలో విషాదచ్ఛయాలు అలుముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు నివాళులర్పిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed