వాళ్ల అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నా.. క్లారిటీ ఇచ్చిన TDP ఎమ్మెల్యే అభ్యర్థి

by GSrikanth |
వాళ్ల అనుమతితోనే రెండో పెళ్లి చేసుకున్నా.. క్లారిటీ ఇచ్చిన TDP ఎమ్మెల్యే అభ్యర్థి
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే పార్టీ నుంచి పోటీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి, కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో పెళ్లిపై ప్రశాంతి రెడ్డి స్పష్టత ఇచ్చారు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ‘తమది చిత్తూరు జిల్లా. ముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడైన హర్షవర్దర్‌ను పెళ్లి చేసుకున్నా. కొన్ని కారణాలతో ఆయన చనిపోయారు. ఆ తర్వాత తమ కుటుంబసభ్యుల అనుమతితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాను. ఎన్నికల బరిలో నిలిచాను. ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. అందుకే పరిచయం చేసుకుంటున్నా’ అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed