Atchannaidu: లేని రింగ్ రోడ్డుకు అక్రమ కేసులా?

by srinivas |   ( Updated:2023-05-14 11:27:18.0  )
Atchannaidu: లేని రింగ్ రోడ్డుకు అక్రమ కేసులా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేయని ఇన్నర్ రింగ్ రోడ్డుకు మార్పు చేసి అక్రమాలకు పాల్పడ్డారంటూ సైకో ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఘోర వైఫల్యం చెందడం నుంచి రైతుల దృష్టిని, వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అద్దె ఇంటిని అటాచ్‌మెంట్ చేయడం వైసీపీ సైకో చర్యలకు నిదర్శనమన్నారు. ఉండవల్లి నివాసం ప్రభుత్వ భూమిలో ఉందని ఒకసారి, అక్రమకట్టడమని మరోసారి.. ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటూ విష ప్రచారానికి పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు.

‘మీ బెదిరింపులకు భయపడేది లేదు. మావికాని ఆస్తులను మావని ఏవిధంగా చెబుతారు?, మీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదొక ఎత్తుగడ. జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు, అరాచకాలకు ఉపయోగించుకుంటున్నారు. విధ్వంసం, విధ్వేషాలతో రాష్ట్రాన్ని అస్థవ్యస్థం చేస్తున్నారు. ప్రజల కష్టాలు పట్టని పాలకుడు జగన్ మోహన్ రెడ్డి. రాజకీయ కక్ష సాధింపులపై జగన్ రెడ్డి చూపుతున్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడటానికి చూపడంలేదు. జగన్ రెడ్డి సైకో పాలనకు, నిరంకుశ ధోరణికి ఘోరీ కట్టే రోజులు త్వరలోనే వున్నాయి. అసమర్ధ పాలనతో మసక బారిన ప్రతిష్టను కాపాడుకోవడానికి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పాపం తనకు చుట్టుకోకుండా ఉండేందుకు ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి జగన్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపైకి ఏసీబీని, సీఐడీని ఉసి గొల్పుతూ కేసులు బనాయిస్తుంది. ప్రతీకార రాజకీయంపై చూపిస్తున్న పట్టుదల రాష్ట్రాభివృద్ది పై, ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడంపై చూపడం లేదు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. జగన్ రెడ్డి సైకో చర్యలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం’. అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Also Read..

AP Politics: ఆ తర్వాతే ముఖ్యమంత్రి పదవి?

Advertisement

Next Story

Most Viewed