- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రాన్ని ఆవిష్కరించిన టీడీపీ
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారం కోసం అన్ని వర్గాలను మోసగించి, అధికారమదంతో వారి జీవితాలను తన స్వార్థానికి బలితీసుకున్న జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బహిరంగ క్షమాపణలు చెప్పాకే బస్సుయాత్ర చేపట్టాలి అని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రాన్ని అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ అన్న దానికి సంబంధించిన ఆధారాలతో కూడిన ఫోటో ప్రదర్శనను, హోర్డింగులను టీడీపీ నేతలతో కలిసి అచ్చెన్నాయుడు పరిశీలించారు.ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న పరిణామాల సమగ్ర సమాచారమే ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి’ కరపత్రం అని టీడీపీ తెలిపింది. టీడీపీ విడుదల చేసిన కరపత్రంలోని అంశాలకు సమాధానం చెప్పాకే జగన్ బస్సుయాత్ర ప్రారంభించాలి అని అచ్చెన్నాయుడు సూచించారు. నాలుగున్నరేళ్లలో అధికారమదంతో జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఊచకోత కోయించాడు అని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఏఏ వర్గాలకు తానేం చేసింది, ఎంతగా వారిని వంచించింది చెప్పాకే జగన్ బస్సుయాత్రలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొనే అధికారపార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు, మంత్రులంతా ఆ యాత్రలో పాల్గొనేముందు ఒక్కసారి గుండెలపై చెయ్యేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు.
54 ఉత్తుత్తి కార్పొరేషన్లతో మోసం
ఒక్క అవకాశమని తెలుగుజాతిని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, తన అసమర్థ, అవినీతి పాలనతో 4 సంవత్సరాల 7 నెలల పాలనలో అన్నివర్గాల ప్రజల జీవితాలను తలకిందులు చేశాడని ఆరోపించారు. మరోసారి మోసగించడానికే తన పార్టీ నేతలు, మంత్రులతో సామాజిక సాధికారత బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో అధికారమదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను దారుణం గా ఊచకోత కోయించిన జగన్ రెడ్డి, బస్సుయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లి, వారికి ఏం చెబుతాడు? అని నిలదీశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రయోజనాలు, ఫలాలను కూడా జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దక్కకుండా చేశాడు అని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన సొమ్ముని కూడా జగన్ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆ పథకాలు రాష్ట్రంలో నిలిచి పోయాయన్నారు. 54 ఉత్తుత్తి కార్పొరేషన్లతో బీసీలను మోసగించిన జగన్ రెడ్డి.. తన హాయాంలో ఒక్క బీసీకైనా పైసా ఆర్థిక సాయం చేశాడని నిరూపించాకే బస్సుయాత్రను చేపట్టాలి అని అచ్చెన్నాయుడు సూచించారు. సంక్షేమ పథకాలకు పితామహుడిగా పేరు పొందిన చంద్రబాబునాయుడు 2014-2019 మధ్య అన్నివర్గాల ప్రజలకు పుట్టుక నుంచి మరణం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వివిధ వర్గాలకోసం అమలుచేసిన పథ కాలను ఎందుకు రద్దుచేశాడో సమాధానం చెప్పాకే జగన్ బస్సు యాత్ర చేపట్టాలి అని అచ్చెన్నాయుడు సూచించారు.
బీసీల రిజర్వేషన్ల తగ్గించిన ద్రోహి
టీడీపీ ప్రభుత్వంలో బీసీలకోసం ప్రత్యేకంగా 30 పథకాలు అమలు చేయడం జరిగిందని... అలానే ఎస్సీలకు ప్రత్యేకంగా 27పథకాలు.. ఎస్టీలకు 29పథకాలు.. మైనారిటీలకు 11 పథకాలు అమలు చేశారు అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వాటన్నింటినీ జగన్ నిర్దాక్షణ్యంగా రద్దు చేశాడని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 20శాతంగా ఉన్న బీసీల రిజర్వేషన్లను చంద్రబాబునాయుడు 14 శాతం పెంచి 34శాతంకు చేర్చితే వైసీపీ 24శాతానికి తగ్గించి బీసీలకు ద్రోహం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొనే అధికారపార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు, మంత్రులంతా ఆ యాత్రలో పాల్గొనేముందు ఒక్కసారి గుండెలపై చెయ్యేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి అని అచ్చెన్నాయుడు సూచించారు. తమ వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాసి, ఆయా వర్గాలపై దాడులు చేయించి, హత్యలు, మానభంగాలు జరిపించిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఉద్ధారకుడా? అని ప్రశ్నించారు. రాజ్యాధికారం మొత్తం తనచేతిలో పెట్టుకొని, అన్నివర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కిందిస్థాయి అధికారపార్టీ నేతల్ని జగన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మార్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆఖరికి గ్రామస్థాయిలో సర్పంచ్‌లను ఎందుకూ పనికిరాని వారిగా చేయలేదా? స్వాతంత్ర్య భారతదేశం ఏర్పడ్డాక, దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు జరగని అన్యాయం.. ద్రోహం మొత్తం ఒకేసారి జగన్ రెడ్డి తన నాలుగున్నరేళ్ల పాలనలో ఆయా వర్గాలకు చేశాడు. జగన్ తమతమ వర్గాలకు చేసిన వంచన, మోసాన్ని బయటపెట్టాకే ఆయన వర్గాల మంత్రులు, వైసీపీ నేతలు ప్రభుత్వం తలపెట్టిన బస్సుయాత్రలో పాల్గొనాలి అని అచ్చెన్నాయుడు కోరారు.
జగన్ మాయలో పడొద్దు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తనను.. తన దుర్మార్గపు ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని సీఎం వైఎస్ జగన్ గ్రహించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అందువల్లే జగన్ సామాజిక సాధికార బస్సుయాత్ర పేరుతో కొత్త నాటకానికి తెరలేపాడు అని ఆరోపించారు. జగన్ మాయాలో పడితే రాష్ట్రం ప్రపంచపటంలోనే లేకుండా పోతుందనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎం.ఏ.షరీఫ్, బుద్దావెంకన్న, నాగుల్ మీరా, కొల్లురవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, తెనాలి శ్రావణ్ కుమార్, ముస్తాక్ అహ్మద్, బీ.రామాంజనేయులు, దున్నుదొర, దారు నాయక్ తదితరులు పాల్గొన్నారు.