- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: మరో కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం.. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాత్రి 7 గంటలకు..
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి 50 రోజులు అవుతోంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో ఉంచారని టీడీపీ నేతలు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం’ అనే కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతులు కట్టుకుని ఇళ్ల వద్దే చంద్రబాబుకు మద్దతు తెలపాలని, ‘నిజం గెలవాలి’ అంటూ గట్టిగా నినాదాలు చేయాలని ఆయన కోరారు. అంతేకాదు అలా నిరసన వ్యక్తం చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు.
కాగా ఇప్పటివరకూ పలు రూపాల్లో నిరసన తెలిపారు. ‘మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం’ కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా పిలుపునిచ్చిన కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి.