- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: సీఎం చంద్రబాబు టూర్ సక్సెస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) పర్యటన(Tour) దిగ్విజయంగా ముగిసిందని, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు(North Andhra Projects)లను పూర్తి(Complete) చేస్తామని సీఎం చెప్పారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు(Union Minister Ram Mohan Naidu) అన్నారు. సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనపై స్పందించిన ఆయన.. పలు కీలక కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం(Srikakulam) పర్యటన నిరాడంబరంగా, ఎక్కడా ఆంక్షలు లేకుండా జరిగిందని, గతంలో జగన్(Jagan) పర్యటిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కునేవారని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుకొనే టీడీపీ(TDP)కి అఖండ విజయాన్ని చేకూర్చారని తెలిపారు. ఒక ముఖ్యమంత్రి జిల్లాస్థాయిలో సమీక్షలు నిర్వహించటం గత చరిత్రలో ఎప్పుడు, ఎక్కడా లేదని, జిల్లాలోని ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని, దీనిపై సీఎం చంద్రబాబు చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే గత ఐదేళ్లలో ఈ జిల్లాలో నీటి పారుదల వ్యవస్థను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు.
జిల్లాలోని వంశధార పేజ్-2(Vamshadhara) ను పూర్తి చేసి 90 టీఎంసీ(90 TMC) నీటిని అందుబాటులోకి తేవటానికి చర్యలు చేపడతామని అన్నారు. ఇక నదులు అనుసంధాన ప్రాజెక్ట్‌లో భాగంగా అసంపూర్తిగా ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారని, ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కొత్త డిపిఆర్ తీసుకుని వాటి పనులు చేపట్టడానికి సీఎం అంగీకరించారన్నారు. అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వలసలు నివారణకు చర్యలు తీసుకుంటామని, అందుకోసం మూలపేట పోర్టు(Mulapeta Port) పనులను త్వరితగతిన పూర్తి చేసి, దీనికి అనుసంధానంగా పారిశ్రామికాభివృద్ధి సైతం చేపట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అంతేగాక మూలపేట సమీపంలో ఎయిర్‌పోర్టు(Airport) ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన అరసవెల్లి(Arasavelli) అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, గ్లోబల్ స్టాండర్డ్స్ స్థాయిలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ ఆలయాభివృద్దిని కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్(Prasadam Scheme)లో భాగంగా చేపడతామని ప్రకటించారు. ఇక జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అంతేగాక జిల్లాలో విస్తృతమైన ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయని, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను జిల్లాకు ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.