- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్‌పై TDP చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై TDP అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లు అనునిత్యం జరుగుతున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పొత్తు పెట్టుకున్నామన్నారు. తాను, పవన్ కల్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాదు.. త్వరలో మరికొన్ని సభల్లోనూ పాల్గొంటామని అన్నారు.
బీజేపీ జాతీయ నేతలు కూడా రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. కూటమి సీట్లలో పెద్దగా మార్పు ఉండబోదు అని స్పష్టం చేశారు. ఇది టీజర్ మాత్రమే అని.. అసలు సినిమా జగన్‌కు ముందు చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగాది రోజున వాలంటీర్లకు శుభవార్త చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇచ్చారు. వాలంటీర్లకు రాబోయే రోజుల్లో 10 వేలు పారితోషికం ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. 2,66,000 మంది వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు.. వాలంటీర్లు జగన్ ను నమ్మి మోసపోవద్దన్నారు.