- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడప జిల్లాపై చంద్రబాబు ఫోకస్.. కమలాపురం ‘రా... కదలిరా’ సభలో కీలక హామీలు
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. కడప ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక సీట్ల టార్గెట్‌గా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కడప జిల్లా కమలాపురంలో ‘రా.. కదలిరా’సభ నిర్వహించారు. ఈ సభలో కడప జిల్లాపై హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే కడప జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామని చెప్పారు. గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకురావాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఒక్క నీళ్లు తప్ప రాయలసీమకు అన్ని వనరులున్నాయన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు తమ ప్రభుత్వంలోనే అత్యధికంగా నిధులు ఇచ్చామని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం కనీసం 20 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు రెండు సార్లు రిబ్బన్ కట్ చేశారని ఎద్దేవా చేశారు. రంగులు వేయడం, పథకాలకు పేర్లు పెట్టుకోవడం తప్ప సీఎం జగన్ మరోటి చేయలేదనని విమర్శించారు. చెల్లికే ఏం చేయాలని వ్యక్తి.. సీమ ప్రజలకు ఏం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
Read More..
సొంత బాబాయ్‌ను ఘోరంగా చంపారు.. సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
షర్మిల ఏపీ పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్.. ఆదివారం నుండి చీఫ్ గా బాధ్యతలు