- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నెల్లూరు ప్రజలకు చంద్రబాబు వరాలు.. పవన్ సమక్షంలో కీలక హామీలు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి నెల్లూరులో కూటమి అభ్యర్థుల తరపున టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు బందిపోటుకు, ఐదు కోట్ల ఆంధ్రులకు జరుగుతున్నవని చెప్పారు. ప్రజలు వేసే ఓటుతో రాతియుగం పోయి.. స్వర్ణ యుగం రావాలని చంద్రబాబు ఆకాక్షించారు. ధర్మ, అధర్మ, విధ్వంసం-అభివృద్ధికి జరిగే ఎన్నికలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సైకోను తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
160 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ సీట్లను గెలుస్తామని చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే 48 వేల ఇళ్లు అర్హులకు అందజేస్తామన్నారు. నెల్లూరు-తిరుపతి-చెన్నైను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరును హార్డ్ వేర్, ఎలక్రానిక్ హాబ్ తయారు చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే బీసీ డిక్లరేషన్‌తో పాటు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. పింఛన్ దారులకు ఏప్రిల్ నుంచి రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులకు వచ్చే ఏళ్లలో లక్ష రూపాయలు అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read More..
డీబీటీ చెల్లింపులకు అనుమతివ్వండి.. ఈసీని కోరిన ఏపీ ప్రభుత్వం