- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyanను తారకరత్న ఏమని పిలుస్తారో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు సినిమా హిట్ అవసరం లేదనేంత అభిమానం ఆయనకే సొంతం. అయితే సినీ రంగంలో ప్రధానంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ ఉండేది. కానీ నిజజీవితంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం చాలానే ఉంది. అటు చిరు, ఇటు బాలయ్య ఇద్దరు కూడా సోదరులుగా పిలుచుకుంటారు. సినిమా ఫంక్షన్లలో సోదరుడు బాలయ్య సినిమా హిట్ కావాలని చిరంజీవి, సోదరుడు చిరంజీవి సినిమా హిట్ కావాలని బాలకృష్ణ చెప్పుకుంటూ ఉంటారు. అటు చిరంజీవి, బాలకృష్ణ వారసులు కూడా అన్నదమ్ములుగా పిలుచుకుంటారు. అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులను సైతం బాలయ్య వారసులు సోదరులుగా పిలుస్తుంటారు.
ఇక చిరంజీవిని బాలయ్య వారసులు పెదనాన్నగా పిలుస్తుంటారు. ఇటీవల కాలంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల విడుదల సమయంలో బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి మాట్లాడుతూ పెదనాన్న (చిరంజీవి) సినిమా చూశామని చెప్పారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా చిరంజీవిని పెదనాన్న అని, నాగార్జునను బాబాయ్ అని అంటుంటారు. ఇక రాంచరణ్‌ను సోదరుడని, బన్నీని బావ అని పిలుస్తుంటారు. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్‌ను కూడా..నందమూరి వారసులు బాబాయ్ అని సంబోధిస్తుంటారు. అటు బాలకృష్ణ కూడా పవన్ కల్యాణ్‌ను బ్రదర్ అని అంటుంటారు. అలా తారకరత్న కూడా పవన్ కల్యాణ్‌ను బాబాయ్ అని పిలుచేవారు. ఈ విషయాన్ని స్వయంగా తారకరత్ననే ఓ ఇంటర్వూలో చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తుపై అడిగిన ప్రశ్నకు తారకరత్న సమాధానం చెబుతూ పవన్ కల్యాణ్ బాబాయ్ జనాలకు సేవ చేయాలనుకుంటున్నారు.. తప్పకుండా రాణిస్తారని చెప్పారు. చిన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ బాబాయ్ సినిమాలు కూడా చూస్తూ పెరిగానని తారకరత్న స్పష్టం చేశారు.
ప్రస్తుతం తారకరత్న కన్నుమూశారు. దీంతో ఆయన మృతికి చిరంజీవి సంతాపం ప్రకటించారు. తారకరత్న ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ ద్వారా తారకరత్న మృతి పట్ల స్పందించారు. ప్రజా జీవితంలోకి రావాలనుకున్న తారకరత్న ఆశలు నెరవేరకుండానే తుది శ్వాస విడిచారని విచారం వ్యక్తం చేశారు. అటు పవన్ అభిమానులు సైతం తారకరత్న మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్‌ను తారకరత్న బాబాయ్ అన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.