అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు నాయుడు

by Hamsa |   ( Updated:2023-05-14 08:34:35.0  )
అత్యాచార ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతలు దారుణాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్నం మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో మహిళలపైనా యువతులపైనా దారుణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కుప్పం నియోజకవర్గంలోని యువతిపై వైసీపీ సర్పంచ్ అత్యాచారానికి పాల్పడటం దారుణమన్నారు.

యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన కుప్పం నియోజకవర్గం పెద్దతండా వైసీపీ సర్పంచ్ పై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ లో ఉన్నాం.. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనే అహంకారంతోనే ఇలాంటి వాళ్ళు తెగబడుతున్నారు. మహిళలపై దారుణాల విషయంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి.. ప్రభుత్వ పెద్దల ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Also Read..

కర్ణాటకలో కాంగ్రెస్​ విజయంతో అంతా గప్​చుప్!

Advertisement

Next Story