దేశమంతా కురుక్షేత్ర వైపు చూస్తోంది.. స్వరూపానందేంద్ర స్వామి

by Javid Pasha |
దేశమంతా కురుక్షేత్ర వైపు చూస్తోంది.. స్వరూపానందేంద్ర స్వామి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో కురుక్షేత్ర వేదికగా చేపట్టిన లక్ష చండీ మహా యజ్ఞం విజయవంతంగా కొనసాగుతోందని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. గతంలో ఎవరూ చేపట్టని ఈ యాగ ఫలాలు భారతావనికే ఉపయోగపడతాయని అన్నారు. ఈ కారణంగానే జాతీయ ప్రముఖులు, హిందూత్వవాదులు యజ్ఞభూమిని సందర్శిస్తున్నారని, యావత్ భారతావని కురుక్షేత్ర వైపు చూస్తోందని అన్నారు. లక్ష చండీ మహాయజ్ఞంలో నాలుగో రోజు మంగళవారం 6976 పారాయణ హోమాలు నిర్వహించారు. 2వేల మందికిపైగా బ్రాహ్మణులు ఈ క్రతువులో పాల్గొన్నారు.

సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన పండితులతో యాగశాల కళకళలాడింది. యజ్ఞ నిర్వాహకులు గుంతి మాత ఆశ్రమాన్ని సందర్శించిన పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు శ్రీచక్రానికి నవావరణ అర్చన సందర్భంగా హారతులు ఇచ్చారు. ఆశ్రమ ప్రాంగణంలోని కాళీమాతకు విశేష పూజలు చేసారు. హర్యానా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ దేశి, ఆర్ ఎస్‌ ఎస్‌ ప్రాంతీయ సంచాలక్ పవన్ జిందాల్ తదితర ప్రముఖులు లక్ష చండీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story