ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

by Mahesh |   ( Updated:2024-08-19 14:28:04.0  )
ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి.. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలకు దిగింది. ఈ క్రమంలో పలు శాఖలపై వచ్చిన ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తుంది. ఇందులో భాగంగా.. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ వేటు పడింది. గతంలోఫైబర్ నెట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు మధుసూదన్ రెడ్డిపై పలు ఆరోపణ వచ్చాయి. ఆయన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ రోజు ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే ఆయన రాష్ట్రం దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా మధుసూదన్ రెడ్డి 2008 బ్యాచ్ కి చెందిన ఐఆర్ఏఎస్ అధికారి.

Read more...

హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే బాలినేని పిటిషన్.. విచారణ వాయిదా

Advertisement

Next Story

Most Viewed