Supreme Court: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

by srinivas |   ( Updated:2023-05-12 14:54:18.0  )
Supreme Court: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
X

దిశ,డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు విభజన ఆలస్యం పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. షెడ్యూల్ 9, 10 లో ఉన్న సుమారు 1.4 లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగలేదని.. ఈ ఆస్తుల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా స్పందించలేదని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సుందరేషన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఏపీ పిటిషన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా ఆస్తుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మధ్యవర్తిగా నియమించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విభజన చట్టం ప్రకారం ఆస్తులలో ఆంధ్రప్రదేశ్‌కు 58శాతం, తెలంగాణకు 42 శాతం వాటా దక్కాలని ఆస్తుల విభజనపై అవసరమైతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మధ్యవర్తిగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది.

జులై నెలాఖరుకు విచారణ వాయిదా

అయితే తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. అయితే తగిన సూచనలు తీసుకుంటామని కేంద్రం తరఫు న్యాయవాది నటరాజన్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అనంతరం ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జూలై నెలాఖరుకు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి:

అది దురుద్దేశం.. అందుకే కోర్టు కొట్టేసింది: చంద్రబాబు

Advertisement

Next Story

Most Viewed