- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నట్టేట ముంచిన తుఫాను: రైతులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్
దిశ,డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుఫాన్ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని సీపీఎం నేతలు అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన పంట పొలాలను సీపీఎం నేతలు కర్రి అప్పారావు, ఆర్ రాములు పరిశీలించారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది. సీపీఎం బృందం బుధవారం అచ్చుతాపురం మండలం ఎర్రవరం, కొండకర్ల, హరిపాలెం గ్రామాల్లో పర్యటించింది. తుఫాన్ కారణంగా గ్రామాల్లో ముంపునకు గురైన వరి పంటలను నేతలు పరిశీలించారు. ఆరు కాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్ తుఫాన్ రూపంలో వర్షాలు కురిసి వరి పంటలు నీటమునిగాయని అన్నారు. అంతేకాదు కుప్పలు సైతం తడిసిముద్దఅయ్యాయని ఆరోపించారు. భారీ వర్షం, ఈదురు గాలులకు వరి పంటతో సహా ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. వరిపంట నీటమునగడంతో ధాన్యం తడిస్తే మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చిన సమయంలో దెబ్బతింటుంటే ఏమీ చేయలేని పరిస్థితులలో రైతాంగం ఉందని అన్నారు. ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది.