- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Apsrtc: పల్లె వెలుగు బస్ ఎక్కండి.. గిఫ్ట్ తీసుకోండి..!
దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బస్సు ఎక్కిన వారికి లక్కి డ్రాలో బహుమతులు అందజేస్తోంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే వారి కోసం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 3వ తేదీ నుంచే అమలు చేస్తోంది. ముందుగా శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2 డిపోల పరిధిలో పల్లెవెలుగులో ప్రయాణించిన వారికి బహుమతులు అందించింది. విజయనగరం, యరగాం, గుత్తావల్లి, శ్రీముఖలింగం, సాలూరు, చీపురుపల్లి, బందరువానిపేట, ఆముదాలవలస రూట్‌లో ఈ స్కీంను ప్రవేశపెట్టారు. బస్సులో ప్రయాణించిన వారు టికెట్ వెనుక వైపు ఫోన్ నెంబర్ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సులో వేయాలి. అలా ప్రయాణికులు వేసిన టికెట్లను ఆర్టీసీ అధికారులు ప్రతి నెలలో రెండు సార్లు డ్రా తీస్తారు. ఈ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి గిఫ్టులు అందజేస్తారు. ఇలా ఒక్క శ్రీకాకుళంలోనే కాదు మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ స్కీంను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రైవేటు వాహనాల వైపు ప్రయాణికులు మళ్లకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ఈ నెల 3న, 16న లక్కీ డ్రా తీశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు చేపట్టిన వినూత్న పథకానికి అటు ప్రయాణికుల నుంచి కూడా భారీగా స్పందన వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.