- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: పేర్నాటి వైసీపీలోనే ఉంటారు.. వైసీపీ నేత పాదర్తి రాధాకృష్ణారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరులో మరో వైసీపీ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్తారంటూ వార్తలు హల్‌చల్ చేస్తు్న్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వైసీపీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత పాదర్తి రాధాకృష్ణారెడ్డి స్పందించారు. నారా లోకేశ్‌ను పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి రహస్యంగా కలిసినట్టు షోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిని భ్రష్టు పట్టించేందుకు ఫేక్ న్యూస్‌లు పెట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదంతా ఓ సీనియర్ టీడీపీ నేత కనుసనల్లో జరుగుతుందని ఆరోపించారు.
వైసీపీని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వీడే ప్రసక్తే లేదని..అసలు టీడీపీలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా పేర్నాటికి లేదని చెప్పుకొచ్చారు. జగనన్న వెంటే పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని వైసీపీ నేత రాధాకృష్ణారెడ్డి కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌లపై రాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కావాలనే ఓడించారనే మనస్థాపం చెంది లోకేశ్‌ను పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి కలిసినట్లు దుష్ప్రచారం చేయడం భావ్యం కాదని పాదర్తి రాధాకృష్ణారెడ్డి విన్నవించారు.