Mla Sridhar Reddy... నీ పని అయిపోయింది!

by srinivas |
Mla Sridhar Reddy... నీ పని అయిపోయింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పని అయిపోయిందని.. ఆయన గౌరవంగా విశ్రాంతి తీసుకోవడం మంచిదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. ఎంపీ ఆదాల నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ చాలా అవకాశాలు కల్పిస్తే వాటిని సద్వినియోగం చేసుకోకుండా రాజకీయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం జాతరకు సంబంధించి తమపై శ్రీధర్ రెడ్డి బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతర జరుపుకుంటే ఆపే అవసరం తమనకులేదన్నారు. వ్యక్తిగతంగా డప్పు కొట్టిచ్చుకోవచ్చని అవసరం అయితే తాను కూడా వచ్చి డప్పు కొట్టిస్తానని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా జాతర జరిపేందుకు ఎవరు కూడా అడ్డుకోరన్నారు. దేవాదాయ శాఖ అధికారులు మెడలు వంచామని తమపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, కానీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు శ్రీధర్ రెడ్డి మెడలు వచ్చిందని విజయకుమార్ రెడ్డి విమర్శించారు.

శ్రీ ఇరుకళల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ జాతరకు సంబంధించి దేవస్థాన అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తనకి అనుమతి వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారన్నారు. జాతరను అడ్డుకోవలసిన పని తమకు లేదని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story