Nellore: ఇంటి గోడ విషయంలో రెచ్చిపోయిన సర్పంచ్.. 50 మందితో దాడి

by srinivas |   ( Updated:2023-06-24 16:34:07.0  )
Nellore: ఇంటి గోడ విషయంలో రెచ్చిపోయిన సర్పంచ్.. 50 మందితో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం గాలిపాళెంలో ఉద్రక్తత చోటు చేసుకుంది.ఇంటి ఆవరణ గోడ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇద్దరు అన్నదమ్ములపై గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కోర్టు ఆదేశాలతో ఇద్దరు సోదరులు గోడ నిర్మించుకుంటున్నారు. అయితే అనుమతి లేదంటూ 50 మంది అనుచరులతో వెళ్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి దౌర్జన్యం చేశారు. ఇద్దరు సోదరుల కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన పోలీసులు గాలిపాళెంలో భారీగా మోహరించారు. పరిస్థితిని సమీక్షించారు. మళ్లీ ఎలాంటి గొడవలు చెలరేగకుండా భారీ బందో బస్తు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story