Breaking: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా

by srinivas |   ( Updated:2024-12-04 10:20:55.0  )
Breaking: పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: పీఎస్‌ఎల్వీ‌సీ-59(PSLVC-59) రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహం(Proba-3 Satellite)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో ఆకాశంలోకి రాకెట్ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో సమస్యను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(European Space Agency) గుర్తించారు. వెంటనే శాస్త్రవేత్తలు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా ఇస్రో అధికారులు ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఈ రోజు సరిగ్గా 4 గంటల 06 నిమిషాలకు ఆకాశంలోకి ప్రయోగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాకెట్‌ను సుమారు 550 కేజీల బరువుతో ఇన్ ఆర్బిట్ డెమానిస్ట్రేషన్ లక్ష్యంగా ప్రయోగించేందుకు సిద్ధం చేశారు. యూరోపియన్ స్పేష్ ఏజెన్సీతో కలిసి ఇస్రో సంయుక్తంగా ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేసింది. కృత్రిమ సూర్య గ్రహణ పరిస్థితులను సృష్టించేందుకు ఈ శాటిలైట్‌ను ప్రయోగించాలని భావించారు. చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ రోజు వాయిదా వేశారు. సమస్యను పరిష్కరించి తిరిగి గురువారం ప్రయోగించేందుకు ఇస్రో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story