Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డిపై కేసు నమోదు

by srinivas |   ( Updated:2023-09-12 07:41:26.0  )
Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌‌రెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తల హౌస్ అరెస్ట్‌లో భాగంగా పోలీసులు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హంగామా చేశారని.. తమ విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్సై రాధా సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన తమపై విరుచుకుపడ్డారని.. అలాగే తమ విధులకు ఆటంకం కలించారని ఏఎస్సై ఫిర్యాదు చేశారు.

కాగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీథర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతి భద్రతల్లో భాగంగా ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసేందుకు ఏఎస్ఐ రాధా సింగ్ బృందం వెళ్లింది. అయితే శ్రీధర్ రెడ్డి వారితో వాదనకు దిగారు. తనను హౌజ్ అరెస్ట్ చేయొద్దని.. పోలీస్ స్టేషన్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story