- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంసన్‌కు భారీ షాక్.. అతనిపై వేటు వేసిన కేరళ బోర్డు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేసిన కేరళ జట్టులో అతనికి చోటు దక్కలేదు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) అతనిపై వేటు వేసింది. కేరళ జట్టు సన్నాహక శిబిరంలో శాంసన్ పాల్గొనలేదు. ఈ కారణంగానే అతన్ని జట్టు నుంచి తప్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
శిక్షణ శిబిరానికి అందుబాటులో ఉండకపోవడానికి గల కారణాన్ని శాంసన్ బోర్డుకు ఈ మెయిల్ చేశాడని, అయితే, శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లనే జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. శాంసన్ దూరమవడంతో బ్యాటర్ సల్మాన్ నిజర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శాంసన్ కేరళ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటి గెలిచిన కేరళ తృటిలో నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించే చాన్స్‌ను కోల్పోయింది.
మరోవైపు, విజయ్ హజరే ట్రోఫీకి దూరమవడం శాంసన్‌కు ఎదురుదెబ్బే అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది వన్డే ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో చోటు కోసం శాంసన్ కూడా రేసులో ఉన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరిగే విజయ్ హజారే టోర్నీలో రాణిస్తే అతనికి మెరుగైన అవకాశాలు ఉండేవని, ఇప్పుడు టీమిండియాలో స్థానం కోసం పరిస్థితులు కఠినమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.