- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుల అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నిందితులను చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మీడియా ఎదుట అడిషనల్ ఎస్పీ వెంకట్రావు ప్రవేశపెట్టారు. అనంతరం హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి అంశాలను మీడియాకు వివరాలు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజును హత్య చేసి ముందు సీట్లో ఉంచి పెట్రోల్‌పోసి తగలబెట్టారని తమ విచారణలో తేలిందన్నారు. రిపుంజయ భార్యతో నాగరాజు తమ్ముడు పురుషోత్తంకు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని తేలిందని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు తెలియజేశారు.
ఈ హత్యలో మొత్తం ఐదుగురు ప్రమేయం ఉందని తెలిపారు. ఏ-1 రిపుంజయ, ఏ-2 చానుఖ్య ప్రతాప్, ఏ-3 గోపీనాథ్, ఏ-4 రమేష్, ఏ-5 కుమార్‌గా గుర్తించారని ఎస్పీ తెలిపారు. రేకల చెరువు అనుపల్లె వద్ద ముద్దాయిలను అరెస్టు చేసినట్లు చెప్పారు. ముద్దాయిలపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగిందని.. హత్య స్థలంలో ఒక వాహనం దహనం కాగా మరో మూడు వాహనాలు హత్యకు ఉపయోగించారని విచారణలో తేలిందన్నారు. మృతుడు నాగరాజు రిపుంజయ మధ్య ఫోన్ సంభాషణలో గొడవ పడ్డ ఆడియో టేప్ సేకరించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. హత్య చేసి తగలబెట్టి ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే నలుగులు నిందితులను అరెస్ట్ చేశామని అయితే ఏ-2 చానుఖ్య ప్రతాప్ పరారీలో ఉన్నారని, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి: ఈ SI మామూలోడు కాదు.. అంతకు మించి..!