- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: ధ్వని సైలెన్సర్ల బైకర్లపై పోలీసులు ఉక్కుపాదం
దిశ,నెల్లూరు: విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అధిక శబ్దం చేసే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ విజయరావు హెచ్చరించారు. ద్విద్రవాహనాల సైలెన్సర్‌లతో అధిక శబ్దాలు చేస్తే వాహనాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు 420 వాహనాల సైలెన్సర్లను ధ్వంసం చేశారు. డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ ధరించాలని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. నెల్లూరు మాగుంట లేవుట్ వద్ద 420 సైలెన్సర్లను తొక్కించడం జరిగిందని తెలిపారు. సైలెన్సర్ తీసేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు పెడతామని, వాహనాలకు ఇటువంటి సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్‌లపై కూడా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరించారు.